PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెగాస‌స్ నిఘా.. లిస్ట్ లో తెలుగు ప్రొఫెస‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పెగాస‌స్ స్పైవేర్ జాబితాలో మ‌రికొన్ని పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. దేశ వ్యాప్తంగా పెగాస‌స్ ఫోన్ హ్యాకింగ్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ప్రముఖుల ఫోన్ నెంబ‌ర్లు పెగాస‌స్ జాబితాలో ఉండ‌టంతో స‌ర్వత్రా ఆందోళ‌న నెల‌కొంది. పెగాస‌స్ జాబితాలో ఫ్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ కూడ ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్గార్ ప‌రిష‌త్ కేసులో నిందితులు, వారి కుటుంబ స‌భ్యులు, వారి త‌ర‌పున వాదించే న్యాయ‌వాదుల ఫోన్ నంబ‌ర్లు పెగాస‌స్ జాబితాలో ఉన్నాయి. ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ కంపెనీ కీల‌క అధికారి ఫోన్ నెంబ‌ర్ కూడ పెగ‌స‌స్ జాబితాలో ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి సిద్దరామ‌య్యా పీఏ వెంక‌టేష్ ఫోన్ నెంబ‌రు, మాజీ సీఎం కుమార స్వామి పీఏ నెంబ‌ర్, మాజీ ఉప‌ముఖ్యమంత్రి ప‌ర‌మేశ్వర నెంబ‌ర్లు కూడ ఉన్నట్టు ది వైర్ ప‌త్రిక ప‌రిశోధ‌న‌లో వెల్లడైంది.

About Author