పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి….
1 min read
సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో పనిచేసే స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్పెం, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ కు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు నగర ఉపాధ్యక్షులు మైముద్ అధ్యక్షతన, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు, కుమార్ లు హాస్పటల్ సూపరింటెండెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, స్వీపర్స్ సెక్యూరిటీ గార్డ్ సమస్యలను అయన కు వివరిస్తూ కార్మికులకు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉండటం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని పస్తువులతో వారు పని చేయడం జరుగుతుందని అయన కు తెలిపారు, A1 ఫ్యాకల్టీ ఏజెన్సీ స్వీపర్శుకు 4 నెలల జీతాలు పెండింగ్ పెట్టగా, ఎక్స్పర్ట్ ఏజెన్సీ వారు సెక్యూరిటీ గార్డ్స్ కు 3 నెలల జీతాలు పెండింగ్లో పెట్టారని, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ కు రెండు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు, ఈ ఏజెన్సీలో కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వకపోగా ఈఎస్ఐపిఎఫ్ తక్కువ కడుతూ కార్మిక చట్టాల అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు, గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడం కోసం కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పి పర్మినెంట్ చేయకపోగా థర్డ్ పార్టీ ఏజెన్సీలనే కొనసాగిస్తూనే కొంతమందిని మాత్రమే అబ్కాస్ లో చేర్చి మిగిలిన కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు, కనుకనే అతన్ని ఇంటికి పంపించారని అందరికీ న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులు చట్టాలు కాలరాశి కార్మిక కోడ్ లు అమలు చేయాలని కార్మికులను బానిసత్వంలోనికి నెట్టాలని ఉవ్విల్లూరుతుందని తెలిపారు,ఈ కూటమి ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు, అపక ధరలు పెంచుతూ అన్ని రకాల పన్నులు పెంచుతూ కార్మికుల పైన ప్రజల పైన భారాలు వేయడం ఖర్చులకు తగ్గట్టు జీతాలు పెంచకపోవడం వలన కార్మికుల కుటుంబాల పోషణ కోసం అప్పుల పాలవుతున్నారని గుర్తు చేశారు, A1,ఎక్స్ ఫర్ట్ ఏజెన్సీలు వచ్చినప్పటి నుండి జీతాలు హక్కులు అడిగిన కార్మికులను అక్రమంగా డ్యూటీలో నుంచి తొలగించడం చేసి కార్మికుల కడుపు కొట్టారని తెలిపారు, కార్మికులు తమ కష్టాలు జిల్లా కలెక్టర్ కి హాస్పిటల్ సూపరిమెంట్ కి, డిసిఎల్ కి ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు విన్నవించినా ఏజెన్సీలకే వత్తాసు పలికి కార్మికుల కన్నీటి బాధలకు కారణమయ్యారని విమర్శించారు, ఇప్పటివరకు కార్మిక సమస్యలు కార్మిక శాఖ ఆఫీసులోనే పెండింగ్ ఉండడం బాధాకరమన్నారు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు యజమానులకే అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ కార్మికులను నట్టేట ముంచుతున్నారని తెలిపారు, నిజంగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ స్వీపర్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు తక్షణమే పెండింగ్ జీతాలు ఇప్పించి అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే డ్యూటీలోనికి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, ఏజెన్సీ అగ్రిమెంట్ కాలం పూర్తయినందున కార్మికులకు పెండింగ్ జీతాలు ఇతర అలవెన్సులు పూర్తి అయిన తర్వాతనే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు, లేని పక్షాన సిఐటియు కార్మికుల కు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు కుమార్, శీను, నగేష్, మరియు కార్మికులు పాల్గొన్నారు.