PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్ వేతనాల విడుదల చేయాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి, ఏసురత్నం ఏ, నాగరాజు సిఐటియు జిల్లా నాయకులువీ. బాల వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ గాడ్సుకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఏ రకంగా బ్రతుకుతారని వారన్నారు ఇచ్చేది తక్కువ వేతనం అందులో మూడు నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉంటే ఏ రకంగా కుటుంబాలను పోషించుకుంటారనీ, ఏ రకంగా వారు డ్యూటీలు చేస్తారని వారు అన్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఓయూ ప్రకారం 40 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారని వారి లెక్కల్లో రాసుకుంటున్నారు కానీ అందులో 34 మందితోనే పని చేయించుకుంటూ ఉన్నారని మిగతా ఏడు మంది జీతాలు ఎక్కడ పోతున్నాయో ఆసుపత్రి సూపర్డెంట్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కి పొందుపరిచిన వారికి 16 వేల జీతం ఇవ్వాలని ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు కాబట్టి వెంటనే ఎం ఓ యు ప్రకారం వాళ్లకి 16 వేల రూపాయలు ఇవ్వాలని అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు వెంటనే వారి అకౌంట్లో వేయకుంటే సిఐటియు ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ ని కలుపుకొని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

About Author