నాడు నేడు పెండింగ్ పనులను సత్వరమే పరిష్కరించాలి..
1 min read– వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయలని ఆదేశం : ఎండిఓ జి రాజ్ మనోజ్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో నిర్మాణంలో ఉన్న సచివాలయాలన్ని నవంబర్ 30 వ తేదీనాటికి అన్ని హంగులతో పూర్తి చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని పెదవేగి ఎండిఓ జి. రాజమనోజ్ అన్నారు. గురువారం మండల పరిధిలో పనిచేసే ప్రతి పంచాయతీ, ప్రతి సచివాలయ కార్యదర్సులు, ఇంజినీరింగ్ అసి స్టెంట్లు కు ముందుగా రూపొందించుకున్న కార్యాచరణ ప్రాణాళికల ద్వారా ఎస్ డబ్ల్యు పి సి షెడ్లు కార్యకలాపాలు యధావిధిగా కొనసాగేలా చూడాలని, ప్రతి పంచాయతీలో వివిద దశలలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ గృహ నిర్మాణాలు త్వరిత గతిని చేపట్టి పూర్తి చేయించాలని, నాడు నేడు ద్వారా పాఠశాలలలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడం పై ఎండిఓ కార్యదర్సులు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల తో జరిపిన సమీక్షా సమావేశంలో తెలిపారు. గాబ్రేజ్ సేకరణ, తడిచెత్త, పొడిచెత్తతో ఎస్ డబ్ల్యు పి సి షెడ్లను నింపాలని గ్రామాలలో పన్నులు వసూలు కూడా చేపట్టాలని ఎం డి ఓ అన్నారు. నిర్మాణాలు పూర్తయిన గృహాలకు బిల్లులు చెల్లింపుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో ఎంపిక చేసిన కరువు పనులను వెంటనే ప్రారంభించి జాబ్ కార్డ్ లున్న వారందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీలలో విధులు నిర్వహించే ఉద్యోగులందరూ 100 శాతం అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలిని పంచాయతీ సిబ్బంది అందరూ యూనిపామ్ ధరించాలని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెండింగ్ లేకుండా ప్రజలకు వాలంటీర్ ల ద్వారా అందేలా చూడాలని కార్యదర్సులు ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఈ సమీక్షా సమావేశం లో ఎండిఓ రాజ్ మనోజ్ దిశా నిర్దేశం చేశారు.