PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

1 min read

– అల్ట్రా మెగా సోలార్ పార్క్ సంబంధించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావాలి…జిల్లా కలెక్టర్ శ్రీ పి.కోటేశ్వరరావు
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్ కు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్ వారి లోకల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సమావేశము జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రభావితగ్రామాలలో ఉన్న పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. .డిసెంబర్ నెల 21వ తారీకు లోపల పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని ఆ రోజుకి ప్రారంభోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధం కావాలని పంచాయతీరాజ్ ఎస్సీ , RWS ఎస్సి మరియు సోలార్ పవర్ ఇంజనీర్లను ఆదేశించినారు. అధికారులు ఇంకా పనుల కు సంబంధించిన యుటలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించలేదు,వాటిని వెంటనే పనికి తగ్గట్టుగా సమర్పించవలసిందిగా కలెక్టర్ గారు కోరారు.శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామాల్లో చేయవలసిన పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. గత పది సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంకు పనులు వేగవంతం చేయాలని గ్రామాల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కోరారు. గని,శకునాల గ్రామస్తులు మాట్లాడుతూ పొలాలు నీటిలో మునిగి ఉన్నాయి వాటిని వెంటనే డీప్ బ్లాస్టింగ్ చేసి ఆ నీటిని పొలాల నుండి బయటకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనారిటీ ఫంక్షన్ హాలు శాంక్షన్ చేయాలని, అక్కడక్కడ అవసరం మేరకు గ్రావెల్ రోడ్డు వేయాలని మరియు కొన్ని చోట్ల రోడ్డు పొడిగింపు పనులు చేయాలని కోరారు.సోలార్ పవర్ ఎండి శ్రీ. రమణారెడ్డి గారు ,కర్నూలు మున్సిపల్ కమిషనర్ శ్రీ భార్గవ తేజ గారు, సోలార్ పవర్ ఎస్ ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్ ఎస్.ఈ.,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , RWS S.E., ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , CPO మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author