PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్ పోయింది.. భిక్షాటన మిగిలింది..!

1 min read

– మూడేళ్లుగా పింఛన్ కోసం వికలాంగుడి పోరాటం..
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్​ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వికలాంగుడికి.. కొన్ని కారణాలతో మూడేళ్లుగా పింఛన్​ నిలిచిపోయింది. పింఛన్ పోవడంతో భిక్షాటన చేస్తూ కడుపు నిప్పుకుంటున్నాడు. పింఛన్ పునరుద్ధరించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రజా ప్రతినిధులు సైతం విషయం తెలిసిన పట్టించుకోవడం లేదని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం బిజినేముల గ్రామానికి చెందిన వర్ల దావీదు పుట్టుకతోనే వికలాంగుడు. రెండు కాళ్లు పనిచేయవు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వంద శాతం వికలాంగత్వ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. దీంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికారులు (ఐడి నెంబర్ 113538891) వికలాంగుల పింఛను మంజూరు చేశారు. 2018 ఆగస్టు నెల వరకు రూ.1500 ల పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అతని పెన్షన్ నిలిచిపోయింది.
వివరణ…
ఈ విషయమై గ్రామ పంచాయతీ అధికారులను వివరణ కోరగా వర్ల దావీదు పింఛన్​కు బ్యాంకు అకౌంట్ లింకు కాలేదన్నారు. 6 నెలలుగా పెన్షన్ తీసుకోకపోవడంతో గతంలో ఉన్న అధికారులు పెన్షన్ నిలిపివేసినట్లు తెలిపారు. కొత్త పెన్షన్ కోసం ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేస్తుంటే అతనికి గతంలో పెన్షన్ వస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. అందు వలన కొత్త పెన్షన్ మంజూరు కావడం లేదని సృష్టం చేశారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

About Author