పెన్షన్ దారుని ఆచూకీ తెలుసుకొని ..పెన్షన్ అందజేత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నాడు హైదరాబాద్ లోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న కర్నూలు వన్ టౌన్ వాసి శ్రీ బలుసా జయ ప్రకాష్ గత రెండు నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదు., సదరు పెన్షన్ దారుని ఆచూకీ విచారించినా పీడీఓ ప్రసాద్ హైదరాబాద్ నందు శ్రీ కార్తికేయ వృద్ధాశ్రమం, కుత్బుల్లాపూర్,హైదరాబాద్ నందు ఆశ్రయం పొందు తున్నాడని తెలిసి సదరు మంజూరైనా రెండు నెలల పింఛన్ మొత్తాన్ని అందచేసినాడు. బలుసు జయప్రకాశ్ రక్త సంబంధికులు ఎవరు లేరు మరియు వారి బంధువుల సహాయంతో ఇక్కడ చేరుకున్నాడని ఈ పెన్షన్ మొత్తం తన వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుందని, మరియు స్థానిక కార్పొరేటరు శ్రీ కె.పరమేష్ కి మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసియున్నారు.