NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీని  తరిమి కొట్టడానికి జనం “సిద్ధం”..! 

1 min read

వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అవినీతి, అక్రమ పాలనతో నిండిపోయిన వైసిపి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. మంగళవారం  నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జి  మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో నందికొట్కూరు పట్టణానికి చెందిన  వైసీపీ యువకులు  టిడిపిలో చేరారు. అల్లూరు గ్రామంలోని మాండ్ర శివానంద రెడ్డి స్వగృహంలో  పట్టణ టిడిపి మైనార్టీ  నాయకులు జమీల్,రసూల్,నేత్ర,ఆరీఫ్, ఆధ్వర్యంలో  వైసీపీకి చెందిన యువకులను   తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణానికి చెందిన  సాదిక్, సంతోష్,ప్రవీణ్,రాఘవ, అఖిల్,ఈర్షద్,తేజ,సయ్యద్,కిషోర్,దిలీప్,రూబెన్,ముజీబ్ తదితరులు టీడీపీ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా శివానంద రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డిని  ఎప్పుడు ఎప్పుడూ గద్దె దించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని  అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా టిడిపి జనసేన కూటమికి అండగా నిలబడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిల్,అథిక్,సంతోష్,షమీర్,రాజ్ కుమార్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పిఏ.మద్దిలేటి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author