PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: టీజీ భరత్​

1 min read

 సమస్యలు తీర్చని నాయకులను ప్రశ్నించాలని సూచన..

  • .. 45, 46వ వార్డులో టి.జి భ‌ర‌త్ భరోసా యాత్ర

కర్నూలు:రానున్న ఎన్నిక‌ల్లో తెదేపాను గెలిపించేందుకు ప్రజ‌లు సిద్ధంగా ఉన్నార‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 45, 46వ వార్డుల పరిధిలో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్యక్రమం చేప‌ట్టారు. ఉమాదేవి ఆసుప‌త్రి వ‌ద్ద నుండి యాత్రను ప్రారంభించి ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అందించే సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి గురించి వివ‌రిస్తూ క‌ర‌పత్రాలు పంపిణీ చేశారు. దీంతో పాటు క‌ర్నూల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను గుర్తించి స్వ‌యంగా రూపొందించిన ఆరు గ్యారెంటీల క‌ర‌ప‌త్రాలు అంద‌జేశారు. కర్నూలు నగరంలో సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రజలు ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేయాలని కోరారు. సమస్యలు తీర్చలేని నాయకులను నిలదీయాలని చెప్పారు. త‌న‌ను గెలిపిస్తే క‌ర్నూలును అన్ని రంగాల్లో ముందుంచుతాన‌ని మాటిచ్చారు. చంద్రబాబు నాయుడు విజ‌న్ వ‌ల్లే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంగా ఎదిగింద‌న్నారు. ఏపీకి ఆయ‌న అవ‌స‌రం ఎలా ఉందో, క‌ర్నూలుకు కూడా త‌న అవ‌స‌రం అంత ముఖ్యమ‌ని భ‌ర‌త్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. చంద్రబాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు లేకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఒక‌వైపు అభివృద్ధి ప‌రుగులు పెట్టిస్తూనే మ‌రోవైపు ప్రజ‌ల‌కు మెరుగైన సంక్షేమ ప‌థకాలు అందిస్తామ‌ని చెప్పారు. గ‌డిచిన ఐదేళ్లలో యువ‌త ఉద్యోగాలు లేక తీవ్ర అవ‌స్థలు ప‌డుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌న్నారు. త‌మ ప్రభుత్వం వ‌స్తే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తమ విధానాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌భుత్వంలో రూ. 5వేలు ఇచ్చి వలంటీర్ల‌ను మాయ‌చేస్తున్నార‌ని, త‌మ ప్ర‌భుత్వం వ‌స్తే వ‌లంటీర్లకు ఇంత‌కంటే మెరుగైన భ‌విష్యత్తు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. క‌ర్నూలు రూపురేఖ‌లు మార్చేవిధంగా తాను ప‌నిచేస్తాన‌ని భ‌ర‌త్ చెప్పారు. ప్రజ‌లంతా త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో 45వ వార్డు సీనియర్ నాయకులు సుంకన్న, వీరశైవ లింగాయత్ రాష్ట్ర నాయకులు శివరాజ్, రవి, ప్రభాకర్, సుందర రాజు, మధు, వెంకటేష్, నాగరాజు, రాముడు, చౌదరి, 46వ వార్డుకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకురాలు సంజీవలక్ష్మి, మధుబాబు నాయుడు, డిష్ బాషా, రాజ్ కుమార్, ప్రదీప్, నరసింహులు, శ్రీనివాసులు, విజయ్, వరాలు, లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, బూత్ ఇంఛార్జీలు, జనసేన నాయకులు పవన్, తదితరులు పాల్గొన్నారు.

About Author