టీడీపీ ఆఫీస్ పై దాడికి చేసిన వ్యక్తులు అరెస్టు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 13వ తారీకు సాయంత్రం ఏడు గంటల సమయంలో కల్లూరు మండలం డి మార్ట్ వెనకాల గల టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి అందులో ఉన్న శేఖర్ గౌడ్ అనే వ్యక్తిని ఇంకా కొంతమందిని వేట కొడవళ్ళు, కత్తులతో చంపడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగినది.13.04.2025 తారీకు సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అదే రోజు రాత్రి శేఖర్ గౌడ్ తండ్రి భూషణ్ గౌడ్ వయస్సు 32 సం,, బృందావన్ నగర్ కర్నూల్ అను అతని పిర్యాదు మేరకు కర్నూల్ 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 127/2025 గా కేసు నమోదు చేయడం జరిగినది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి ముద్దాయిలను ఈ దినం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను వేట కొడవల్లను స్వాధీనం చేసుకొని వారిని గౌరవ కోర్టు వారి ఎదుట హాజరు పెట్టడం జరిగినది.
ముద్దాయిల వివరాలు:ఏ1 భూపని ప్రభాకర్ నాయుడు, తండ్రి వెంకట నాయుడు, వయస్సు 33 సం,,కర్నూల్ ఏ 2 కాశి @ కాశి బాబు తండ్రి నాగేశ్వర్ రావు వయస్సు 29 సం,, కర్నూల్, ఏ 3 రహంతుల్లా తండ్రి ఫిరోజ్వయస్సు 29 సం,, ఏ 4 పటన్ సలాం ఖాన్వయస్సు 29 yrsవీరందరూ వైసిపికి చెందిన వారు.నలుగురిని అరెస్టు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కర్నూల్ డిఎస్పీ శ బాబు ప్రసాద్ , కర్నూల్ ఫోర్త్ టౌన్ సిఐ మధుసూదన్ గౌడ్ మరియు ఎస్ఐ చంద్ర శేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.