PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అడుగడుగునా నీరాజనం నారా లోకేష్ కు జేజేలు పలికిన ప్రజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఎమ్మిగనూరు నియోజక వర్గంలోనీ గోనెగండ్ల మండలంలో గాజుల దిన్నే నుండి 87వ రోజు పాదయాత్ర ను ఉదయం వర్షం పడటం తో కొంత ఆలస్యంగా తొమ్మిది గంటలకు ప్రారంభించిన నారా లోకేష్,ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి జయ నాగేశ్వర రెడ్డి తో కలసి కొంతదూరం వెళ్ళగానే మత్స్యకారులు లోకేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ ప్రభుత్వం జి ఓ నంబర్ 217 ను తీసుకువచ్చి మా బ్రతుకులు బజారున పడేశారని,అన్ని ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు తొలగించిందని తెలిపారు.టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీఓ నంబర్217 ను రద్దు చేస్తామని,మత్స్యకారులకు ప్రభుత్వ సబ్సిడీ పై వలలు, బోట్లు, ఫైబర్ బొట్లు, ప్రమాద భీమా ను అమలు చేస్తామన్నారు.అలాగే గాజుల దిన్నే గ్రామ క్రాస్ దగ్గరకు రాగానే గాజులదిన్నె ప్రాజెక్టు మునక భూమి రైతులు లోకేష్ ను కలసి మా పొలాలకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు ఎత్తును పెంచుతున్నారని దానివల్ల దాదాపు రెండు వందల ఎకరాలు మునిగి పోతున్నాయన్నారు. దీని వలన మా కుటుంబాలకు ఆసరా లేకుండా పోతుందని మాకు పరిహారం ఇప్పించి, కుటుంబానికో ఉద్యోగం ఇప్పించేలా చేయాలని కోరారు.అనంతరం మునగ పంట వేసిన రైతు చల్లా నాగిరెడ్డి తోట లోకి వెళ్లి పంటను పరిశీలించి రైతుతో పంట దిగుబడి గురించి తెలుసుకున్నాడు.అలాగే గాజులదిన్నె వాల్మీకులు టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని జిల్లాల వాల్మీకులను ఎస్ టి లో చేర్చేలా పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేలా చేయాలని కోరారు.పాదయాత్ర లో వలస కూలీలను కలిసి మాట్లాడాడు.దారి పొడవునా మహిళలు, పిల్లలను, వృద్ధులను పలకరిస్తూ ముందుకు కదిలాడు. కైరవాడి గ్రామంలో కి ప్రవేశించిన వెంటనే మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. వికలాంగులు లోకేష్ ను కలిసి మాకు పెన్షన్ రావడం లేదని వినతి పత్రాన్ని ఇచ్చారు. అలాగే కౌలు రైతులు, ఉల్లి రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. ఉల్లి పంట వలన గత మూడు సంవత్సరాలుగా నష్టం వస్తుందని ఉల్లికి గిట్టుబాటు ధర ను టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కల్పించి రైతులను ఆదుకోవాలని, కౌలు రైతు రంగన్న రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవించే వాడని అతను గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదం మరణిస్తే అతనికి బీమా వర్తించదు అని ఈ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని రంగన్న భార్య మరియు గ్రామస్తులు లోకేష్ కు తెలుపగా టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అన్నింటినీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే పాదయాత్ర చేస్తూ పుట్టపాశం చేరుకోగానే ఎం ఆర్ పి ఎస్ అద్వర్యం లో ఎస్ సి కాలనీ సమస్యలు, డ్రైనేజీ సమస్యల గురించి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఎన్టీఆర్ గృహాలకు ఇంతవరకు ఈ ప్రభుత్వం బిల్లులను మంజూరు చెయ్యడం లేదని కొందరు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత డ్రైనేజీ లను, ఎస్ సి కాలనీ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, ఎన్టీఆర్ గృహాలకు బిల్లులను పెంచి ఇస్తామని తెలిపారు. అడుగడుగునా జనసందోహం తో పాదయాత్ర మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేముగోడు శివారు లోని విడిది కేంద్రానికి చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ సి సెల్ ఎం ఎస్ రాజు, గుడివాడ ఇంఛార్జి వెనిగండ్ల రాము, భూమా అఖిల ప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఉమాపతి నాయుడు, గుడిసె క్రిష్ణమ్మ, మాజీ జిల్లా పరిషత్ ఉపాద్యక్షురాలు పుష్పవతి, పార్వతమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author