PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

25,35 వయస్సులో యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించటం బాధాకరం

1 min read

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ ప్రసాద్

అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం, ట్రాఫిక్ సిగ్నల్ తప్పనిసరిగా పాటించాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను తెలుసుకోవడం ముఖ్యమని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కెవిఎస్.ప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఏలూరు సి.ఆర్.రెడ్డి అటానమస్ కళాశాల నందు నెహ్రు యువ కేంద్ర స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రము నిర్వహించారు.  రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 16 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు వారు మరణిస్తుండటం చాల బాధాకరమన్నారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు సైన్లు, ట్రాఫిక్ లైట్లను అనుసరించడంతో పాటు ఒకే లైనును అనుసరించాలని, రహదారి కూడళ్ళను దాటేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని  రోడ్డుకు ఎప్పుడు ఎడమవైపు ఫుట్పాత్ పైన్ నడవాలని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాస్ వద్ద దాటడం చాల ఉత్తమమని అలాగే రోడ్డు దాటే సమయములో ముందుగా కుడి వైపు చూస్తూ, ఆతర్వాత ఎడమవైపు చూసి జాగ్రత్తగా రోడ్డును దాటడం మంచిదన్నారు. కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కెవిఎస్.ప్రసాద్, జి.ప్రసాదరావు, నెహ్రు యువ కేంద్ర సంస్థ యూత్ వాలంటీర్  పాయం సింధు పాల్గొన్నారు.

About Author