PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవరిది అభివృద్ధి పాలనో.. ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు

1 min read

జగన్ పాలనలో రాష్ట్రంలో రాతి యుగం – చంద్రన్న పాలనలోనే అంతా స్వర్ణ యుగం..

రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

సిద్ధం సభ విజయవంతం కాకపోవడంతో, వాస్తవాలు బయటకి వెళ్తాయనే భయంతోనే మీడియా పై వైసిపి నాయకులు దాడులు చేశారు..

దెందులూరులో జరిగిన సిద్ధం సభలో సైతం మీడియాపై వైసిపి అల్లరి మూకలు దాడులు చేశారు- అది మరువక ముందే రాప్తాడు ఘటన..

సీఎం సభలోనే మీడియాపై ఇలాంటి దాడులు జరగటం అంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు

రాప్తాడులో జరిగిన వైసిపి అల్లరి మూకల దాడిలో గాయపడిన జర్నలిస్ట్ శ్రీ కృష్ణకు సంఘీభావం తెలియచేసిన చింతమనేని ప్రభాకర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి  : అవినీతి అక్రమాలతో నిండి పోయిన వైసిపి ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎవరిది అభివృద్ధి పాలనో, ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసని ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.వైసిపి నాయకులు బూటకపు ప్రసంగాలు చేయటం మానుకుని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సూచించారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దామన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగంగా చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా? అని మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న వైసిపి నాయకులను చింతమనేని ప్రభాకర్ నిలదీశారు. జగన్ సిద్దం అని సభలు పెట్టి, ఆశుద్ధం మాటలు చెపుతున్నారని, 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ అని, ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టారని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని చింతమనేని ఎద్దేవా చేశారు.రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడము దెయ్యాలు వేదాలు వల్లించటంతో సమానం అని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదని, ఏ ఊరుకెళ్లినా వైసీపీ పాలనలోని 5 ఏళ్ల విధ్వంసం కనిపిస్తోందని , వందల కోట్లు ఖర్చు చేస్తూ, అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారని అన్నారు. జగన్ నోటి నుంచి వచ్చేవి అన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు అని, సహజ వనరుల దోపిడీ చేస్తున్న జగన్, స్కాంలు కోసమే స్కీంలు పెట్టాడని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి జగన్ సామాజిక ద్రోహం చేస్తున్నారని, సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే జగన్ రెడ్డికి లేదని అన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్.టి.సి, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారని, సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ప్రస్టేషన్ తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కి 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందని, టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారని, ఎస్.సి., ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు జగన్ దారి మళ్లించారని అన్నారు.చంద్రబాబు  పేరు పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 1.50 లక్షల టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు, పోలవరం గుర్తుకు వస్తాయని,జగన్ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా గుర్తుకొస్తాయని అన్నారు. జగన్ పేరు చెపితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తుకువస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి, రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

About Author