యోగాంధ్రలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి
1 min read
అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య
కర్నూలు, న్యూస్ నేడు: యోగాంధ్రలో ప్రజలు భాగస్వామ్యులు అయి అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 రోజున ప్రజలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు, ఇప్పటికే యోగాంధ్ర క్యాంపేయన్ ప్రారంభించుకోవడం జరిగిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంకా ఒక నెల ఉన్నదని, ఈ నెల రోజులు యోగ గురించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని, జూన్ 21 వ తారీకున విశాఖపట్నంలో మెగా ఈవెంట్ జరుగుతుందని దీనికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనాలనే లక్ష్యంతో ఈ క్యాంపియన్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ కోర్ట్ జడ్జి కిషోర్ గారు, డిఎస్ఓ రాజా రఘువీర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిఎస్ డి ఓ భూపతి రావు, డిఏఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ కె వి ఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వినియోగదారుల సంఘాల అధ్యక్షులు శివ మోహన్ రెడ్డి, ఐఓసి సేల్స్ ఆఫీసర్ రామ్మోహన్, వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీ ల సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, వివిధ కంపెనీల పెట్రోల్ బంక్ డీలర్లు మరియు వారి సిబ్బంది పౌరసరఫరాల శాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.