PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలో చేరిన 42 వ వార్డు ప్రజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ అన్నారు. బుధవారం నగరంలోని 42 వ వార్డుకు చెందిన ప్రజలు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మౌర్య ఇన్ లో టిజి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో మాట్లాడుతూ కర్నూలు అభివ్రుద్ది చెందాలంటే తనను గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. నాయకులందరూ కష్టపడాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వలి, సురేష్, రంజిత్, శివ, ఎల్లగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

About Author