బీటీ.నాయుడుకి బ్రహ్మరథం పట్టిన కర్నూలు ప్రజలు
1 min read
రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఉమ్మడి కర్నూలు జిల్లా తరుపున ఆత్మీయ సన్మానం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ హాల్ నందు రెండోవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ.నాయుడు కి ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది,ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని బీటీ.నాయుడు కి బ్రహ్మరథం కట్టారు,ఈ సందర్భంగా బీటీ.నాయుడు మాట్లాడుతూ రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులునారా చంద్రబాబునాయుడు కి,యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ,తనపై అభిమానంతో కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు,పార్టీ శ్రేణులకు శిరసాభివందనం చేస్తూ,ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు తనపై చూపించిన వెలకట్టలేని ప్రేమాభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ.భరత్ గ,కర్నూలు జిల్లా అధ్యక్షులు పి.తిక్కా రెడ్డి ,నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ,ఎంపీ బస్తిపాటి నాగరాజు ,మాజీ మంత్రివర్యులు కేఈ.ప్రభాకర్ ,ఎమ్మెల్యేలు కెయి.శ్యాం బాబు ,పార్థసారథి వాల్మీకి ,కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ,వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మ ,కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ,గౌరు వెంకటరెడ్డి , ఇన్చార్జిలు మీనాక్షి నాయుడు ,రాఘవేందర్ రెడ్డి ,వీరభద్ర గౌడ్ ,ఆకేపోగు ప్రభాకర్ ,వైకుంఠం జ్యోతి , కెవి.సుబ్బా రెడ్డి ,నాగేశ్వరరావు యాదవ్ ,గుడిసె కృష్ణమ్మ ,గట్టు తిమ్మప్ప ,తుగ్గలి నాగేంద్ర , పి హనుమంతరావు చౌదరి,కమ్మూరు నాగరాజు మరియు ఉమ్మడి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు,కార్యకర్తలు,శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.