ప్రజలు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
1 min read– ఫ్యామిలీ ఫిజీషియన్ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రమాదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేదల ఇంటి వద్దకే డాక్టర్ల బృందాన్ని పంపి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని మంచి చికిత్స అందించేందుకు ఫ్యామిలీ పిజిసియన్ డాక్టర్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఫ్యామిలీ ఫిజీషియన్ రాష్ట్ర పరిశీలకులు( నోడల్ ఆఫీసర్) డాక్టర్ రమాదేవి అన్నారు, గురు వారం ఆమె మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో పర్యటించి అక్కడి ఆరోగ్య ఉప కేంద్రాలలో గ్రామీణ పేదలకు వైద్యం సక్రమంగా అందుతుందా, లేదా అని పరిశీలించారు, అలాగే అక్కడికి వచ్చిన పేషెంట్లను ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ అందుబాటులో ఉన్నారా, మీకు డాక్టర్లు సక్రమంగా వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు, అలాగే అక్కడి డాక్టర్లకు సిబ్బందికి సూచనలిస్తూ రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు లలో వివరాలను నమోదు చేయాలని తెలిపారు, అదేవిధంగా రోగులకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించినప్పుడు వారికి సంబంధించిన రిపోర్టులను కూడా వారికి తెలియజేసి, రికార్డులలో పొందుపరచాలని తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా వైద్య సిబ్బంది అడుగులేయాలని తెలిపారు, అదేవిధంగా అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలలు పరిశీలించి అక్కడి పిల్లలకు వ్యక్తిగత శుభ్రతపై, అలాగే వైద్య వైద్య సేవలు అందించాలని ఆమె తెలిపారు, గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు వైద్యం అందించేటప్పుడు వారిని ఆప్యాయంగా పలకరించి వారికి వైద్య సేవలు అందించాలని ఆమె తెలిపారు, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.