ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి గాయత్రి గ్రామస్తులకు సూచించారు. మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో వైద్యాధికారులు సిబ్బంది బుధవారం వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు అందించారు. ఇంటి వద్ద మంచంపై ఉన్న రోగులకు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీసి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ వర్కర్లకు సూచించారు. గ్రామంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 104 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి గాయత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది 104 సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.