నీటి ప్రమాదాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
1 min readఅగ్నిమాపక అధికారి భీమలింగయ్య
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : నీటి ప్రమాదాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి భీమలింగయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ మరియ అగ్నిమాపక శాఖ వారి ఆదేశాల మేరకు కడప జిల్లా రాయచోటి పట్టణంలో నీటి ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అగ్నిమాపక అధికారి భీమలింగయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వంకలు,వాగులలో నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా ఎక్కవ శాతం నీటి ప్రమాదాలకు యువత గురవుతున్నారని ఈ మధ్యకాలంలోనే జిల్లా వ్యాప్తంగా చాలా మంది నీటి ప్రమాదంలో మృతిచెందడం జరిగిందన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే 101 డయల్ చేసి సమాచారం అందించాలని అగ్నిమాపక అధికారి భీమలింగయ్య వెల్లడించారు.