వర్క్ ఫ్రం హోం’ సర్వేకు ప్రజలు సహకరించాలి
1 min read
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన ‘వర్క్ ఫ్రం హోం’ సర్వేను నగరంలో జరుగుతుందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో 18 నుండి 50 ఏళ్లలోపు 2.73 లక్షల మంది పౌరులను సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికి 1.73 లక్షల మందికి సర్వే పూర్తి అవ్వగా, మిగిలిన 1 లక్ష మందికి సర్వే చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారి వివరాలతో పాటుగా వారి అభిప్రాయాలను సైతం సచివాలయ సిబ్బంది సేకరించడం జరుగుతుందని, అందుకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కావున నగర ప్రజలు ఈ సర్వేకు సహకరించాలని అదనపు కమిషనర్ కోరారు.