జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే
1 min read– గోనెగండ్లలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం..
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ప్రజలు జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, సంక్షేమ పథకాల లబ్ధి వివరిస్తూ గడప గడపకు వెళ్లినా, నాటి టీడీపీ ప్రభుత్వం చేసినది, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినది వివరించి భవిష్యత్తు గురించి వాకబు చేసినా సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను తిరిగి సీఎంగా గెలిపించుకుంటామని చెబుతున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. శనివారం “జగనన్న మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన గోనెగండ్ల లో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీపీ నసురుద్దీన్ లు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వలంటీర్లు , ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు లతో కలసి గోనెగండ్ల లోని కురువపేట, లక్ష్మీపేట లలో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనలోని తేడాలను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రజలకు వివరించారు. అలాగే సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఏమైనా సమస్యలు ఉన్నాయా? తదితర ప్రశ్నలు అడుగుతూ వారి సమాధానాలు ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసుకున్నారు. ప్రజల అనుమతితో వారి ఇంటి గోడలపై “మా నమ్మకం నువ్వే జగన్” స్టిక్కర్ అతికించి, మొబైల్ కు మరో స్టిక్కర్ అతికించి, టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ట్ కాల్ ఇప్పించారు. ఈ సందర్భంగా కురవపేటలోని లింగన్న అనే రైతు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఇలాగే 30ఏళ్లు రావాలని, చంద్రబాబు ప్రభుత్వం వస్తే వర్షాలు పడక రైతులు అధోగతి పాలవుతామని సాగునీరు లేక వలసలకు వెళ్లిన పరిస్థితులు మా కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉన్నాయని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటినుండి సమృద్ధిగా వర్షాలు కురుస్తూ భూగర్భ జలాలు పొంగిపొర్లుతున్నాయని రైతులు గ్రామంలోనే ఉంటూ పంటలు పండిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగేష్ నాయుడు, మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, మండల జే సి ఎస్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.మన్సూర్, మురళి నాయుడు,.మండల కన్వీనర్ దొరబాబు, కాశీవిశ్వనాథ్ రెడ్డి, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.