ప్రజల భవిష్యత్తు నిర్ణయించేది ఓటు మాత్రమే : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు , వెబ్ కర్నూలు: ప్రజల భవిష్యత్తును ఐదేళ్లకోసారి వచ్చే ఓటు నిర్ణయిస్తుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని 51 వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమంతో పాటు ఒక్కరోజు అన్న క్యాంటిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ ఎలాంటి నాయకుడు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఇక పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను ఈ ప్రభుత్వం ఎందుకు తీసివేసిందో ప్రశ్నలా మిగిలిపోయిందన్నారు. కర్నూలు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నామని.. నగరం అభివ్రుద్ది కావాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఏ అవసరమొచ్చినా సహాయం చేసేందుకు తామెప్పుడూ ముందుంటామన్నారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. కర్నూల్లో టిజి భరత్ గెలిస్తేనే ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు. ప్రజా సేవ చేేసేందుకు టిజి కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. అనంతరం అన్న క్యాంటిన్ ద్వారా ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి గణేష్, క్లస్టర్ ఇంచార్జి బొల్లెద్దుల రామక్రిష్ణ, నగర అధ్యక్షుడు గున్నామార్క్, కార్పోరేటర్ పరమేష్, ఇతర వార్డుల ఇంచార్జీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.