ప్రజల సుఖ సంతోషాలే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం.
1 min readఅవ్వా తాతలకు అండగా సీఎం జగన్.
దేశంలో రూ 3 వేలు పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం మనదే.
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్.
జూపాడుబంగ్లా లో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీలో ఎంఎల్ఏ ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల సుఖ సంతోషాలే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ ధ్యేయమని, అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు దేశంలోనే రూ 3 వేలు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్టం మనదేనని ఈ ఘనత ఒక సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.గురువారం జూపాడుబంగ్లా మండలంలోని మహిళా సమాఖ్య భవనంలో పండుగ వాతావరణం లో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతే.బాలయ్య ,ఎంపీపీ సువర్ణమ్మ, తూడిచెర్ల సర్పంచ్ బాల మద్దిలేటి , ఎంపీటీసీ మోతే వెంకటమ్మ , మండల వైసీపీ నాయకులు మోతే.పెద్దన్న , వైసీపీ నాయకులు పారుమంచాల దేవసహాయం, పోతులపాడు శివానంద రెడ్డి, తాటిపాడు ఉస్మాన్ బాషా, వార్డు మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల తహసిల్దార్ పుల్లయ్య యాదవ్ , ఏరియా కో ఆర్డినేటర్ డేగలయ్య , ఇంచార్జి మండల అభివృద్ధి అధికారి నూర్జహాన్ ,ఈఓఆర్డీ చక్రవర్తి , ఏపిఎం అంబమ్మ , వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.