PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల ప్రాణ భధ్రత.. మన అందరి సామాజిక బాధ్యత..

1 min read

– హెల్మెట్ ధారణపై అవగాహన.. ఎన్ఫోర్స్మెంట్ చర్యలను మరింత కఠిన తరం చేయాలి..

– జిల్లా రహదారుల భధ్రత సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కలిగించడంతోపాటు ప్రత్యేక డ్రైవ్ లు నిరంతరాయంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భధ్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలు నడిపేవారు ఎక్కువగా మరణాలు జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయని ఇందుకు హెల్మెట్ లు ధరించకపోవడమే ప్రధాన కారణంగా కనబడుతుందన్నారు.  ఈదృష్ట్యా హెల్మెట్ ధరించడంపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు.  ఇందుకు ఒక నెల సమయం ఇవ్వాలని , ఈ సందర్బంలో నిరంతరాయంగా ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ చర్యలను కఠినతరం చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తీసుకున్న చర్యల మూలంగా ఏమాత్రం రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు తగ్గాయో అంచనా వేయాలన్నారు.  అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించాలని ఈ విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని తప్పనిసరిగా పెనాల్టీ విధించాలన్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి ముఖ్యంగా ట్రక్కు, లారీ డ్రైవర్లను గుర్తించి అటువంటి వారి పై చర్యలు గట్టిగానే తీసుకోవాలన్నారు.  ఎల్ యంవి డ్రైవింగ్ కు సంబంధించి నిబానాలపై కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఆటోల్లో ఓవర్ లోడు లేకుండా చూడాలన్నారు.  ప్రతి ఒక్కరి ప్రాణం వారి జీవితంతో ముడిపడిఉన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.  జాతీయ, స్టేట్ హైవేల్లో రోడ్డు భధ్రతకు సంబంధించి అవసరమైన చర్యలను వచ్చే సమావేశం నాటికి నివేదించాలన్నారు.  గతంలో జరిగిన రోడ్డు భధ్రత కమిటీ సమావేశంలో తలెత్తిన సమస్యలు వాటిని ఏమేరకు పరిష్కరించింది వివరాలు తెలియజేయాలని తదుపరి మీటింగ్ నాటికి పరిష్కరింపబడని అంశాలను ఎజెండాలో పొందుపరచాలన్నారు.  జాతీయ రహదారి డివైడర్ పై నాటికి మొక్కలకు ట్యాంకర్లద్వారా నీటి సరఫరా కాకుండా డ్రిప్ వినియోగించి మొక్కలకు నీటిని అందజేసే చర్యలను చేపట్టాలన్నారు.  ప్రస్తుతం వినియోగిస్తున్న ట్యాంకర్ల ద్వారా ఏవైనరోడ్డు ప్రమాదాలకు తావిస్తే అటువంటి రహదారి నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  డ్రిప్ ఏర్పాటుకు 60 రోజులు సమయాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు.  జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ఎక్కడైతే లైటింగ్ అవసరమో వాటి వివరాలను అందజేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.  అదే విధంగా ఎక్కడైతే బ్లా క్ స్పాట్ ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు జాయింట్ తనిఖీలను నిర్వహించాలన్నారు. పోలీసు రవాణా, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖాధికారులు, ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డేటాబేస్(ఐరాడ్) ద్వారా కారణాలు తెలుసుకొని నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లాలో విస్ర్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు.    సమావేశంలో ఆర్టిఓ కె. శ్రీహరి, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ , డిసిహెచ్ డా. ఎవిఆర్ మోహన్, డిఇఓ శ్యామ్ సుందర్,డియంహెచ్ఓ డా. నాగేశ్వరరావు,పలువురు ఎన్ హెచ్ పిడిలు, ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author