ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సచివాలయానికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో మధుసూదనరెడ్డి సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని యల్లావత్తుల గ్రామ సచివాలయం అలాగే డి కొట్టాల గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని చందలూరు గ్రామంలో చెత్త సంపద కేంద్రం నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సమయాల పాలన పాటించాలని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలతో పాటు పారిశుద్ధ్యం అభివృద్ధి అర్హులైన వారికి అందించే సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో సేకరించిన తడి పొడి చెత్తను వ్యర్థ పదార్థాలను చెత్త సంపద కేంద్రానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా చెత్త సంపద కేంద్రంలో ఎరువులను తయారు చేసి రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చందలూరు గ్రామంలో చెత్త సంపద కేంద్రం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సచివాలయం సిబ్బందికి సూచించారు ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.