PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులపై ప్రజా ప్రతినిధుల కన్నెర్ర..

1 min read

– ట్రాన్స్ ఫార్మర్లకు అధికారులు రైతుల నుండి అధిక వసూల్లు -సబ్సిడీపై శనగలు ఎవరికిచ్చారంటూ ఆగ్రహం -అధికారులపై ఎంపీపీ ఎంపీడీఓ అసహనం -పట్ట పగలే గ్రామాల్లో వీధిలైట్లు దర్శనమిస్తే బిల్లులు రావా..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన  వాడీ వేడీగా జరిగింది. ఎంపీడీవో కార్యాలయంలో  మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశానికి ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, ఎంపిడిఓ జిఎన్ఎస్ రెడ్డి, తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు వచ్చిన తర్వాత సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉండడం పట్ల సమావేశానికి మేము ముందు రావాలా..మీరు ముందు రావాలా అంటూ ఎంపీడీవో సిబ్బందితో అనగా మేము వచ్చిన తర్వాత చాలా సేపటికీ అధికారులు వస్తూ ఉన్నారని ఇలాగైతే జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపిస్తానని ఎంపీపీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.తర్వాత సమావేశం ప్రారంభమైన వెంటనే వివిధ శాఖల అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాల్లో కరెంట్ కోతలు ఎప్పుడు పడితే అప్పుడు తీయడం వల్ల అంతేకాకుండా రాత్రి 9 గంటలకు మరియు ఉదయం నాలుగు గంటలకు ఫుల్ కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ అధికారులకు గాని సబ్ స్టేషన్ కు గానీ మేము ఫోన్లు చేస్తే ఫోన్లు పని చేయవని మాకే ఫోన్లు ఎత్తకపోతే సామాన్య ప్రజల ఫోన్లు ఎత్తుతారా అంటూ సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి నందికొట్కూరు విద్యుత్ శాఖ ఏడిఏ శ్రీనివాసులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పుడు అడిగినా ఎల్ ఆర్ అని చెబుతారని అన్నారు. నాగలూటిలో కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఉషారాణి మరియు వైస్ ఎంపీపీ నబి రసూల్ అన్నారు. చెరుకుచెర్లలో పనిచేసే జూనియర్ వెటర్నరీ అధికారి ప్రతాప్ ను జలకనూరు జేవిఓ ఇన్చార్జిగా నియమించారని ఆయన ఎప్పుడూ విధులకు రాకపోవడం వల్ల పశువులకు రోగాలు వస్తూ ఉన్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని గ్రామ సర్పంచ్ కురువ ఎల్లయ్య అన్నారు.ప్రతాపపై చర్యలు తీసుకోవడానికి తీర్మానం రాసిస్తే నేను జిల్లా అధికారులకు పంపిస్తారని పశు వైద్య అధికారి చంద్రమోహన్ సర్పంచుకు సూచించారు. పట్టపగలే గ్రామాల్లో వీధిలైట్లు వెలుగుతూ ఉంటే వేల సంఖ్యలో బిల్లులు రావా అని అధికారులు ఏమి చర్యలు తీసుకోవడం లేదని ప్రజా ప్రతినిధులు అన్నారు. గ్రామాల్లో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేసి వేయటానికి రైతుల వద్ద నుంచి 8 వేల రూపాయల దాకా రైతుల నుండి విద్యుత్ అధికారులు వసూల్లు చేస్తున్నారని అంతేకాకుండా ఎగ్స్ ఫీజ్ కు కూడా రైతులను పీడించి డబ్బులు తీసుకుంటున్నారని రైతుల నుండి డబ్బులు తీసుకున్న విషయం గురించి నేరుగా వారితోనే ఇప్పుడే ఫోన్లో మాట్లాడిస్తానని బైరాపురం సర్పంచ్ ఫణిభూషణ్ రెడ్డి ఏడిఏ శ్రీనివాసులుతో వాగ్వివాదానికి దిగారు.మా గ్రామంలో ఎంపీపీ పాఠశాల గత ఐదు నెలల నుండి నిర్మాణాన్ని పాఠశాల హెడ్మాస్టర్ ఆపివేశారని ఈ పాఠశాలకు నేనే మెటీరియల్ సిమెంటు హెడ్మాస్టర్ కు ఇప్పించానని షాప్ వాళ్లు నన్ను డబ్బులు అడుగుతున్నారని ఎంఈఓ శ్రీనాథ్ తో సర్పంచ్ ఫ ని భూషణ్ రెడ్డి అన్నారు.చింతలపల్లి మరియు తదితర గ్రామాల్లో జింకలు పంటలను నాశనం చేస్తున్నాయని ఎంపిటిసి నాగేశ్వర రెడ్డి అన్నారు.ప్రభుత్వం నుండి మంజూరు అయిన సబ్సిడీ శ నగలు ఎవరెవరికి ఇచ్చారో ఏమీ తెలియదని ప్రజా ప్రతినిధులకు మాకే శనగలు రాకపోతే సామాన్య ప్రజలకు శనగలు వస్తాయా అని వారు ప్రశ్నించారు.దేవనూరు తదితర గ్రామాల్లో మల్లికార్జున రిజర్వాయర్ గురించి మండల కో ఆప్షన్ సభ్యులు పెద్ద మౌలా బాష తహసిల్దార్ ప్రకాష్ బాబును అడగగా ఈ ప్రాజెక్టు రద్దు అయిందని తహసిల్దార్ ఆయనకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author