ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు గైర్హాజరు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాంటి కార్యక్రమం బుధవారం ప్యాపిలి మండల పరిధిలోని వెంగళపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సర్పంచ్ రంగస్వామి అధ్వర్యంలో నిర్వహించారు. వీటికి అధికారులు మాత్రం తప్పనిసరిగా విధులు నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంకంగా మారింది. ప్రజా ప్రతినిధులు లేని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించారు. దేవుడు కనికరించిన పూజారి కనికరించలేదు అన్న సామెత లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు సమకూర్చాలని ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు హజరు కాకపోవటంతో గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమని నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ,ఎఓ కొండయ్య ,పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి ,ఇఓఆర్డీ బాలకృష్ణ ,వ్యవసాయ అధికారి షేక్షావలి , ఏపీఎం కృష్ణమూర్తి ,సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి ,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎఇ రవి మరియు ఎంపిటిసి రామనాయుడు, సుధాకర్ గౌడ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.