ప్రజల పక్షం” పల్లెవెలుగు ”
1 min read
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలిచే దిన పత్రిక పల్లెవెలుగు పత్రిక అని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్ అన్నారు. మంగళవారం పల్లెవెలుగు దిన పత్రిక నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి పగడం జయరాజు ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను సీపీఐ జిల్లా నాయకులు రఘురామ మూర్తి, రమేష్ బాబు, సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, గోపాలకృష్ణ , కౌన్సిలర్ చాంద్ బాష లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పత్రికలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పల్లెవెలుగు ఒక సంచలనమ న్నారు.పత్రిక స్థాపించిన అనతికాలంలోనే ఎన్నో సంచనాలు సృష్టించి పలు చిన్న పత్రికలకు దారిచూపించిందన్నారు. ప్రజా సమస్యలను కళ్ళకు కట్టినట్లు వార్తల రూపంలో ప్రజలకు తెలియజేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పల్లెవెలుగు దిన పత్రికను అభినందించారు. ప్రజా సమస్యలను వెలికితీసి పరిష్కారానికి పల్లెవెలుగు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.