పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే జగనన్న సురక్ష లక్ష్యం
1 min readధనవంతుడితో సమానంగా పేద ప్రజలకు వైద్య సేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష ఓ వినూత్న కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే గొప్ప లక్ష్యం, తపనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.బుధవారం కొత్తపల్లి మండలం నందికుంట గ్రామంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష” క్యాంపును ఎమ్మెల్యే ఆర్థర్ పరిశీలించారు.జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ప్రజలకు ఏర్పాటుచేసిన సదుపాయాలను పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను ఇంటి వద్దకే వెళ్లి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమన్నారు. పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు ఆనందం అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలియజేశారు. సుమారు మూడు వేలకు పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవాడికి మరింత ఆరోగ్య భద్రత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవని, ఒక్క మన రాష్ట్రంలోనే ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జగనన్న భుహక్కు భూరక్ష పత్రాలను భూమి యజమానులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిత్యలక్ష్మీదేవి,మండల తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ , మండల అభివృద్ధి అధికారి దాసరి.మేరీ ,జెడ్పిటిసి సోమల సుధాకర్ రెడ్డి , వైసీపీ నాయకులు జకరయ్య, దుర్గం నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, మండల నాయకులు దుద్యాల మహమ్మద్ రఫీ , సాయిరాం , శ్రీనాథ రెడ్డి ,నక్క.విజయకుమార్ , కుమ్మరి నారాయణ, రాము, లింగం, కదిరి సుబ్బన్న, ప్రసాద్, ముడియాల. వెంకట రమణారెడ్డి ,సుబ్బా రెడ్డి , వైద్యులు, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.