శాశ్వత వర్క్ ఫ్రం హోం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫైనాన్షియల్ సేవల కంపెనీ సింక్రోనీ శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశాన్ని ఉద్యోగులందరికీ కల్పించింది. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు సింక్రోనీ ఎస్‌వీపీ ఆండీ పొన్నేరి తెలిపారు. దీనివల్ల ఉద్యోగులకు, వారి కుటుంబాలకే కాకుండా కంపెనీకి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. శాశ్వత డబ్ల్యూఎఫ్ హెచ్ సదుపాయం వల్ల మరింత మంది నిపుణులను ఆకర్షించడానికి వీలుంటుందని, పని జీవితం మధ్య సమతౌల్యం దెబ్బతినకుండానే ఉద్యోగులు మంచి ఉత్పాదకతను అందించగలరని చెప్పారు.