NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5జీ ట్రయ‌ల్స్ కు అనుమ‌తి.. చైనా టెక్నాల‌జీ వ‌ద్దు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త టెలీకం సంస్థలు 5జీ ట్రయ‌ల్స్ నిర్వహించేందుకు టెలికాం శాఖ అనుమ‌తిచ్చింది. చైనా టెక్నాల‌జీ వాడ‌కూడ‌ద‌ని తేల్చిచెప్పింది. రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ లు 5జీ ట్రయ‌ల్స్ నిర్వహించ‌నున్నాయి. ఎరిక్ స‌న్, నోకియా, శాంసంగ్, సీ-డాట్ అభివృద్ధి చేసిన 5జీ టెక్నాల‌జీ వాడ‌నున్నారు. జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాల‌జీని వాడనుంది. మొద‌ట చైనాకు చెందిన హువాయ్ అభివృద్ధి చేసిన టెక్నాల‌జీ ఉప‌యోగిస్తామ‌ని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రక‌టించాయి. త‌ర్వాత నోకియా, శాంసంగ్, ఎరిక్ స‌న్, సీ-డాట్ అభివృద్ధి చేసిన టెక్నిల‌జీ ఉప‌యోగిస్తామ‌ని ప్రక‌టించాయి. ఈ మేర‌కు ఆ సంస్థల‌తో ఒప్పందం కూడ చేసుకున్నాయి. 5జీ ట్రయ‌ల్స్ నిర్వహించ‌డానికి 6 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. రెండు నెల‌లు సామాగ్రిని స‌మ‌కూర్చుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.

About Author