తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అనుమతి..!
1 min read
పల్లెవెలుగు వెబ్: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల పై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించిన ప్రభుత్వం .. కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 నుంచి 1 గంట వరకు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల వరకే సడలింపు ఉండటంతో రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం తీసకున్న నిర్ణయంతో రిజిస్ర్టేషన్లు ప్రారంభంకానున్నాయి.