లోదుస్తులు తీస్తేనే అనుమతి !
1 min readపల్లెవెలుగువెబ్ : నీట్ పరీక్ష సందర్భంగా కేరళ, మహారాష్ట్రల్లో విద్యార్థినులు అవమానాలను ఎదుర్కొన్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కేరలోని కొల్లామ్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం సిబ్బంది… విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారు. సదరు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీట్ నిబంధనల ప్రకారమే తాను బట్టలు వేసుకుందని, అందులో లోదుస్తుల ప్రస్తావనే లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌లలో ఎక్కువమంది పురుషులే ఉన్నారని, అలాంటప్పుడు విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు.