నేర స్వభావం కలిగిన వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలి
1 min read– పీటర్ జోసెఫ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలో విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి దీనిపైన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ అన్నారు. స్థానిక యువజన కాంగ్రెస్ జిల్లా కార్యాలయం లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నగరం లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుందని ఎక్కడనుండి సరఫరా అవుతుందో , ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి అని ఆయన అన్నారు.విజయవాడ నగంలోని శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా వాంబేకాలనీ , కొత్త రాజరాజేశ్వరి పేట, JNMU అపార్ట్మెంట్స్ , ప్రాంతంలో , , వన్ టౌన్ , కొత్తూరు తాడేపల్లి, KT రోడ్, కృష్ణలంక కరకట్ట రోడ్ , పాతపాడు రోడ్ , ప్రాంతాలలో యువత గంజాయి మత్తులో తిరుగుతూ ఆయా ప్రాంతంలో నివసించే వారిని భయపెడుతూ , ఇబ్బందులకు గురిచేస్తునారు రైల్వేస్టేషన్ సమీపంలో ప్రయాణికులు రాత్రి సమయంలో వారి ఇళ్లకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి నెలకొంది ఈ ప్రాంతాలపై పోలీస్ కమిషనర్ గట్టి నిఘా ఏర్పాటు చేసి గంజాయి మత్తులో తిరుగుతున్న వారిని పట్టుకొని గంజాయి ఎక్కడ నుండి సరఫరా అవుతుందో తెలుసుకొని వారిని శిక్షించాలని కోరుతూ , యువతను ఈ మత్తులో నుండి రక్షిoచవలసిన భాధ్యత పోలీస్ వారిపై ఉన్నది . ఆయా ప్రాంతాలలోపోలీస్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి గంజాయి మత్తులో ఉన్నటువంటి అకాతాయీలను , నేరస్వభావం కలిగిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకొని ఆయా ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాము అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.