ఎర్రకోట తనదేనంటూ కోర్టులో పిటిషన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీలోని ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బెంచ్ కొట్టివేసింది. పిటిషనర్ సుల్తాన్ బేగం తనను తాను మెఘల్ రాజు బహదూర్ షా జఫర్-11 మనుమడైన దివగంత మీర్జా మొహమ్మద్ బెదర్ భక్త్ భార్యగా (విడో) పేర్కొంది. తన భర్త 1980 మే 22న చనిపోయినట్టు తెలిపింది. ఢిల్లీలోని ఎర్రకోటకు తాను చట్టబద్ధమైన వారసురాలిననీ, 1957లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టవిరుద్ధంగా ఎర్రకోటను తమ అధీనంలోకి తెచ్చుకుందని సుల్తానా బేగం తెలిపారు. ఎర్రకోటను తనకు తిరిగి అప్పగించాలని, లేని పక్షంలో దానిని భారత ప్రభుత్వం అక్రమంగా తమ అధీనంలో ఉంచుకున్నందుకు 1857 నుంచి ఈరోజు వరకూ తగినంత పరిహారాన్ని చెల్లించాలని ఆమె కోరారు.