జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారికి వినతి
1 min read– పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు..
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : వివిధ అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులు.దరఖాస్తు చేసుకున్న పి ఎఫ్ ఋణాలను ఎక్కౌంట్లలో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ కి పి.ఆర్. టి.యు. జిల్లా అధ్యక్షులు పి ఆంజనేయులు వినతి పత్రాన్ని అందజేశారు. వైద్యఖర్చులు,పిల్లల వివాహాలు,ఇంటి నిర్మాణం ఇంటి మరమ్మత్తులు తదితర అవసరాల నిమిత్తం ఉపాద్యాయులు దరఖాస్తు చేసుకున్న పి ఎఫ్ ఋణాలు తమరి పరిధిలో వేగంగానే మంజూరు అవుతున్నప్పటికీ, ఎఫ్ ఎం ఎస్ లో పెండింగులో పడుచున్నవని గత ‘మే’ ఒకటవ తేదీ నుండి సి ఎఫ్ ఎం ఎస్ వెళ్ళిన బిల్లులు వారి వారి అక్కౌంట్లలో జమ కావడంలేదని.అందువల్ల ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే దీపావళి కానుకగా డిఏ (కరువు భత్యం) ప్రకటించాలని పి.ఆర్.టి.యు.రాష్ట్రంలో పనిచేయుచున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన డిఎ బకాయిలతో పాటు 11వ పిఆర్ సి తర్వాత రెండు కరువు బత్యములను దీపావళి కానుకగా ప్రకటించాలని జిల్లా పి.ఆర్.టి.యు అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు మరియు ప్రధాన కార్యదర్శి కె వి వి సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు,వివిధ అవసరాల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్న ఏ పి జి ఎల్ ఐ మరియు పిఎఫ్ రుణాలతో పాటు సరెండర్ లీవ్,మెడికల్ బిల్లులు సి ఎఫ్ ఎం ఎస్ లో పెండింగులో ఉన్నాయని తెలియజేస్తూ సత్వర పరిష్కారం నిమిత్తం తమకు కూడా తెలియపరుస్తున్నామని ఈ తీవ్రుమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలరని అధ్యక్షులు ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.