చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి సవితమ్మకు వినతి పత్రం
1 min read
చెన్నూరు న్యూస్ నేడు: చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను వారి సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రహ్మణ్యం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు విన్నవించుకుని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం రామనపల్లి చేనేత కార్మికులతో కలిసి మంత్రి సవితమ్మకు తమ సమస్యలను చెప్పుకోవడం జరిగిందని విలేకరులకు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచితంగా ఇల్లు వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని కోరడం జరిగిందని అదేవిధంగా, చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తద్వారా పూర్తి ఉచిత వైద్యం ప్రభుత్వమే అందించాలని కోరడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి చేనేత కార్మికుడికి జీవిత బీమా అందించి ప్రమాదవశాత్తు సంఘటన జరిగితే ప్రభుత్వమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగిందని. రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడికి 30 వేల రూపాయలు ప్రతి ఏటా ఆర్థిక చేయూతని కల్పించాలని కోరామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు వెంటనే చేనేత గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని మంత్రి కి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు, బడిగింజల మురళి , గుగ్గిళ్ళ చాణుక్య ,సుబ్బారావు, బొమ్మన శ్రీకాంత్, మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.