NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి.. ఆపస్

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక శాసనసభ్యులు ద్వారా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలనే   కార్యక్రమంలో భాగంగా సిపియస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన GPS జీవో 116 ను ఉపసంహరించుకొని, పాత పెన్షన్  విధానం మాత్రమే అమలు చేయాలని ,3,4,5 తరగతులను ఉన్నత పాఠశాల లో విలీనం చేయడం వలన కలుగుతున్న ఇబ్బందులుకు కారణమవుతున్న,ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన జీవో 117 ను రద్దు చేసి, గతంలో వల్లే ప్రతి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కొనసాగించాలని, సంవత్సరాల కొలది పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం సహకారం అందిచాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగ శాసన సభ్యులనుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) బాధ్యులు కలసి వారికి వినతిపత్రం అందజేసి కోరడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో డిసెంబర్ నెల మొదటి వారంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author