వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబుభూ సమస్యలతో పాటు వివిధ సమస్యలపై గ్రీవెన్స్ కు తరలివచ్చిన అర్జీ దారుల నుండి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబులు వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వెను వెంటనే సబంధిత అధికార్లకు ఫోన్లు చేసి సమస్యలను తెలియజేసి పరిష్కరించాలని సూచించారు.గుంటూరుకు చెందిన మహమ్మద్ సుభాని గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. లాలాపేట చిన్నబజారు ఏరియాలో ఉన్న తన స్థలాన్ని అందులో ఉన్న రేకుల షెడ్ ను గుడివాడ వెంకట అప్పాజీరావు, అతని గూండాలు ఆక్రమించి తనను చంపుతామని బెదిరిస్తున్నారని.. దయ చేసి తనకు న్యాయం చేయాలని వాపోమాడు. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నగిరిపాడు గ్రామంలో 1980 లో ప్రభుత్వం తమకు భూమి మంజూరు చేసిందని.. తన తండ్రి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ కాలం చేశాడని.. అనంతరం కొంతకాలం ఆ భూమి బీడుగా ఉండటంతో వైసీపీ నాయకులు దాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తూ.. అది తమ పేరుమీద ఆన్ లైన్ కాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దారపువానిపేట గ్రామానికి చెందిన డి. సన్యాసిరావు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. శ్రీకాకుళం కలెక్టరేట్ ఆఫీసులోని భవన నిర్మాణ పనులను తమ చేత చేయించుకొని జేపీఆర్ కన్షక్షన్ కంపెనీ వారు తమకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని.. దయ చేసి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి వెంకటేష్ రెడ్డి గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వంలో తాము గ్రామంలో సీసీ రోడ్ల పనులు చేయడం జరిగిందని.. దానికి సంబంధించిన బిల్లులు రూ. 50 లక్షలు ఇప్పటికి రాలేదని.. బయట వడ్డీలకు తెచ్చి పనులు చేశామని.. దయ చేసి తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి వాపోయాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం వై.సీ పల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేస్తూ… గత ప్రభుత్వంలో తమ గ్రామంలో జరిగిన రీసర్వే తప్పుల తడకగా ఉండటం వలన డ్రిప్ పరికరాలకోసం ఆన్ లైన్ లో నమోదుకు ఆటంకం కలుగుతుందని.. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
