పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించేది వారే !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలే నిర్ణయిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో క్రూడాయిల్ కొరత లేదని చెప్పారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, క్రూడాయిల్ కొరత ఉండబోదని అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పారు. మనకు అవసరమైనదానిలో 85 శాతం క్రూడాయిల్‌ను, అదేవిధంగా 50 నుంచి 55 శాతం వరకు గ్యాస్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందని, అయినప్పటికీ ఇంధన అవసరాలు తీరేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.