పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి.. లీటర్ పై ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితికి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది.