పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాల్సిందే..: సీపీఐ
1 min read
పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి. గురువారం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి, చెత్త పన్నులు విపరీతంగా పెంచారని, విద్యుత్ చార్జీలు ట్రూ ఆప్ పేరుతో పెంచడం అన్యాయమన్నారు. ప్రజలపై భారం పడకుండా వంట గ్యాస్ , పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రమణ బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు హనుమంతు, బాలకృష్ణ,రంగన్న,వీరేష్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.