మోదీ హాయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా పెరిగాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రధాన మంత్రి నరేంద్రమోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. పౌరుల జీవనోపాధి, సమాఖ్య వ్యవస్థకు మద్దతుగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అయితే విపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి మోదీని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.