NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్, డీజిల్ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జీఎస్టీ ప‌రిధిలోకి ఇంధనాన్ని తీసుకువ‌స్తే కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతార‌మ‌న్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావ‌డం పై జీఎస్టీ మండ‌లి నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆమె చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా చ‌ట్టస‌వ‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రంలేద‌న్నారు. రాష్ట్రాల‌కు చెల్లించాల్సిన జీఎస్టీ ప‌రిహారాన్ని కేంద్రం అడ్డుకుంటుందన్న విప‌క్షాల ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌న్నారు. ఇంధ‌న ధ‌ర‌లు పెరిగినా.. ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించే ప్రతిపాద‌న‌లేద‌న్నారు. ప‌ప్పుధాన్యాలు, నూనె గింజ‌ల ఉత్పత్తి త‌గ్గడంతో.. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ కార‌ణంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయ‌ని చెప్పారు.

About Author