పెట్రోల్, డీజిల్ రేటు తగ్గింపు.. కేంద్రానికి ఎంత నష్టమో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు రుణం కోసం ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం ప్రకటించిన నిర్ణయం వల్ల దాదాపు 12.9 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని కేంద్రం కోల్పోతుందని అంచనా. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, వస్తు, సేవల పన్ను , వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా వసూలైన సొమ్ము పేదలు, రైతులకు ఆహారం, ఎరువుల కోసం రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవల తగ్గించిన ఎక్సయిజ్ సుంకాల వల్ల ఖజానాకు రాబోతున్న నష్టాన్ని అదనపు రుణాల ద్వారా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.