పెండింగులో ఉద్యోగుల పి ఎఫ్ ఋణాలు..
1 min read– జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారిని కలసిన పిఆర్ టియు సంఘ అధ్యక్షులు పి ఆంజనేయులు..
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: జిల్లా వ్యాప్తంగా వివిధ అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులు.దరఖాస్తు చేసుకున్న పి ఎఫ్ ఋణాలను ఎక్కౌంట్లలో జమ అయ్యేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవోని పి ఆర్ టి యు ఏలూరు జిల్లా అధ్యక్షులు పి ఆంజనేయులు స్వయంగా ఆయన చాంబర్లో కలిసి మెమోరాండ్ అందజేశారు,జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు వైద్యఖర్చులు,పిల్లల వివాహాలు,ఇంటి నిర్మాణం ఇంటి మరమ్మత్తులు తదితర అవసరాల నిమిత్తం ఉపాద్యాయులు దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ ఋణాలు తమరి పరిధిలో వేగంగానే మంజూరు అవుతున్నప్పటికీ, సిఎఫ్ఎంఎస్ లో కాలక్రమేణ పెండింగులో పడుచున్నవి.గత మే ఒకటవ తేదీ నుండి సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళిన బిల్లులు వారి వారి అక్కౌంట్లలో జమ కావడంలేదని వాపోయారు,అందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని సత్వర పరిష్కారం నిమిత్తం మీకు కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తున్నామని ఈ తీవ్రుమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలరని మా ఉద్యోగ సంఘం తరఫున కోరుచున్నామని అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు.