75 ఏళ్ల వయసులో పీహెచ్డీ !
1 min read
పల్లెవెలుగు వెబ్ : తులసి సుబ్బారావు 75 ఏళ్ల వయసులో పీహెచ్డీ పూర్తీ చేశారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకత్సవంలో ఆయన పీహెచ్డీ పట్టా పొందారు. మనవళ్లను ఆడించాల్సిన వయసులో.. తన మనవడి వయసున్న వారితో కలిసి చదువుకున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన తనను ఏడుపదుల వయసులోనూ విశ్వవిద్యాలయం వైపు నడిపించిందని ఆయన చెప్పారు. చదువుకు వయసు అడ్డురాదనడానికి ఆయనో గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి 1970లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తీ చేసి.. దేశ విదేశాల్లో వివిధ హాదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో పదవీవిరమణ తర్వాత మలిదశ విద్యాభ్యాసం ప్రారంభించారు. తన ఆసక్తికి కార్యరూపం ఇచ్చి.. కాలేజీలో చేరారు. పీహెచ్డీ కోసం ఐదేళ్ల పాటు రోజుకు కనీసం 10గంటలు వెచ్చించినట్టు ఆయన తెలిపారు. తన కొడుకు వయసు ఉన్న ప్రొఫెసర్ల బోధనలో.. తన మనవడి వయసున్న వారితో కూర్చుని చదవడం మంచి అనుభూతినిచ్చిందని తులసి సుబ్బారావు చెప్పారు.