NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆధార్ తో ఫోన్ నెంబ‌ర్ లింక్.. ఇంటి వ‌ద్దకే పోస్ట్ మ్యాన్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆధార్ తో మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ చేయాలా ?. అయితే ఇక నుంచి మీరు ఆధార్ సీడింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఆధార్ సీడింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేదు. పోస్ట్ మ్యాన్ కు క‌బురు పంపితే ఆయ‌నే మీ ఇంటి వ‌ద్దకు వ‌చ్చి ఆధార్ తో ఫోన్ నెంబ‌ర్ లింక్ చేస్తారు. ఈ సేవ‌ల‌కు గాను 50 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ త‌పాలా శాఖ ఈ సేవ‌ల‌ను జూన్ నుంచి అందుబాటులోకి తెచ్చింది. రాష్రంలో ఇప్పటికే సుమారు 5 ల‌క్షల మంది ఈ సేవ‌ల‌ను పొందారు. పోస్ట్ మ్యాన్ వ‌ద్ద మొబైల్ అప్లికేష‌న్ ఉంటుంది. దాని సాయంతో వారు వినియోగ‌దారుల మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ కార్డ్ కు అనుసంధానిస్తారు.,

About Author