PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ

1 min read

– ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా  పట్టణంలోని ముబారక్ ఫంక్షన్ హాలు నందు శనివారం ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోరెల్లి సుధాకర్  ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందని అన్నారు. చిత్ర రూపాన్ని ఫోటోగ్రఫీగా మార్చి ఫోటోగ్రాఫర్లు సమాజంలో చైతన్యం తెస్తున్నారని కొనియాడారు.నందికొట్కూరు పట్టణంలో కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఫొటోగ్రాఫర్ల కు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.   అనంతరం అకాల మరణం చెందిన  ఫొటోగ్రాఫర్ చిన్న కుటుంబానికి ఫొటోగ్రాఫర్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల మైనారిటీ జోనల్ ఇంఛార్జ్ అబూబక్కర్, కౌన్సిలర్ చిన్నరాజు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జబ్బార్, వైసిపి నాయకులు ఉస్మాన్ బేగ్, జవ్వాజి సుంకన్న గౌడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.

About Author