అనాధ వృద్ధుడు ని చేరదీసిన పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ
1 min read
వృద్ధాశ్రమం కోసం ప్రభుత్వ స్థలం విషయమై సహాయం అందించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గారిని కోరుతున్నా నిర్వాహకులు సింగనేటి నరసన్న
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగనేటి నరసన్న కు అందించిన సమాచారం మేరకు ఎమ్మిగనూరు మైనార్టీ కాలనీలో ఉన్న మహమ్మద్ అలీ 81 సంవత్సరాల వృద్ధుడు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు గత కొన్ని రోజుల కిందట సైకిల్ తొక్కుతూ వస్తుండగా లారీని తప్పించబోయి కింద పడడంతో తొడ పైన లోపల భాగం ఎముక విరిగి అనారోగ్యానికి గురై ఉన్నాడు స్థానికులు కుటుంబ సభ్యులకు తెలపగా వారు కనీసం కన్నెతి కూడా చూడకపోవడంతో తెలిసినవారు కాలనీవాసులు ఒక పూట ఉండి లేక ఆహారం అందిస్తూ కాలం కడుపుతున్నాడు పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమం నిర్వాహక దంపతులు యస్ నరసన్న ప్రతిభ భారతి ఎస్ ఎఫ్ ఆర్ మహిళా చైతన్య వేదిక టౌన్ అధ్యక్షరాలు సి సునీత వారు తాతకు ఎక్సెరా తీయించి మెడిసిన్ అందించి ఫ్రూట్స్ అందించి తన ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటున్నారు. ఎమ్మిగనూరు టౌన్ లో అనాధలు దిక్కులేని వారు వృద్ధులు భిక్షాటన చేస్తూ తలదాచుకోవడానికి వృద్ధాశ్రమం లేక అవస్థలకు గురై అనారోగ్యంతో చనిపోతున్నారు ఇది పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటి ని కలచి వేస్తున్న బాధాకరమైన సంఘటన ఇప్పటికే 8 మంది అనాధ వృద్ధులను భూస్థాపిత కార్యక్రమాలు చేశామని వారు తెలిపారు.